మీ రాష్ట్రం, మీ విరాళం,

మీ ప్రభుత్వం

మీరు ప్రస్తుతం నివసిస్తున్న దేశం?
రాష్ట్రం
పూర్తి పేరు
ఫోన్
ఈమెయిల్ ఐడి
విరాళం ఇవ్వండి

ఈ సమాచారం గేట్ వే చెల్లింపు ద్వారా
సరిగ్గా కొనసాగుతుందని దయచేసి నిర్ధారించుకోండి
పూర్తి పేరు :
ఈమెయిల్ ఐడి :
ఫోన్ :
దేశం :
రాష్ట్రం :
విరాళం :
కరెన్సీ :
భాష :

గమనిక: 18 సంవత్సరాలు నిండిన భారత పౌరులు మాత్రమే విరాళాలను ఇవ్వడానికి అర్హులని గమనించగలరు.
మీరు అందించే విరాళాలు నేరుగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి అందుతాయి. బ్యాంకు ఖాతా పార్టీ కోశాధికారి నిర్వహణలో ఉంటుంది.

జగనన్న నవరత్నాలు

ఈ 9 హామీలు (నవరత్నాలు) అభివృద్ధి మరియు సంతోషాల నిలయంగా న‌వ్యాంధ్ర‌ రాష్ట్ర నిర్మాణాకి పునాదులు అవుతాయని మేము నమ్ముతున్నాము.

వైఎస్సార్ రైతు భ‌రోసా

 • ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ. 12,500
 • రైతులకు వడ్డీలేని రుణాలతో పాటు భీమా ప్రీమియం ప్రభుత్వం ద్వారా చెల్లింపు
 • రైతులకు ఉచితంగా బోర్లు, 9 గం. ఉచిత కరెంట్, మరియు వ్యవసాయ ట్రాక్టర్ల రోడ్ టాక్స్ రద్దు
 • సహకార డెయిరీకి పాలు పోసే వారికి లీటరుకు రూ.4 సబ్సిడీ
 • ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, అవసరం మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
 • గిట్టుబాటు ధరల కోసం రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి,రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయక నిధి

ఆరోగ్య‌శ్రీ

 • వ్యాధి ఏదైనా చికిత్స ఖర్చు రూ. 1,000 దాటితే ప్రభుత్వమే చెల్లిస్తుంది
 • డబ్బు ఎంతైనా చికిత్స ఎక్కడ చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తింపు
 • దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతి నెల రూ.10,000 పింఛన్
 • చికిత్స తరువాత విశ్రాంతి సమయంలో ఆర్థిక సహాయం

యువత - ఉపాధి

 • 10 మంది స్థానిక యువతకి గ్రామ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రభుత్వ పథకాల డోర్ డెలివరీ కోసం రూ. 5000 గౌరవ వేతనంతో ప్రతి 50 ఇళ్ళకు ఒక గ్రామ వాలంటీర్ నియామకం
 • రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 2 లక్షల ఉద్యోగాల భర్తీ
 • పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టాన్ని తెస్తాం
 • ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తెస్తాం

ఫీజు రీయింబర్సుమెంట్

 • పేదవాడి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తాం
 • పూర్తి ఫీజు రీయింబర్సుమెంట్ తో పాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా ప్రతి విద్యార్థికి రూ. 20,000

అమ్మఒడి

 • అమ్మఒడి ద్వారా పిల్లల్ని బడికి పంపితే చాలు, పంపినందుకు ప్రతి పేదింటి తల్లికి సంవత్సరానికి రూ. 15,000
 • అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేదిస్తాం

పింఛన్ల పెంపు

 • ప్రస్తుతం ఉన్న పింఛన్ల వయస్సు 65 నుంచి 60 కి తగ్గించి, వృద్ధులకు పింఛన్ రూ. 3,000 వరకూ పెంచుకుంటూ పోతాం
 • వికలాంగులకు పింఛన్ రూ.3,000

వైఎస్సార్ ఆస‌రా

 • పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా అందిస్తాం
 • సున్నా వడ్డీకే రుణాల విప్లవం, ఆ వడ్డీ డబ్బు ప్రభుత్వమే బ్యాంకులకు కడుతుంది
 • 45 నుండి 60 సంవత్సరాల లోపు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ అక్కలకు రూ.75 వేలు దశలవారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా ఇస్తాం
 • కార్పోరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగేలా పారదర్శక ప్రమాణాలను తీసుకువస్తాం

వైఎస్సార్ గృహ నిర్మాణం

 • ఇళ్ళు లేని పేదలందరికీ పక్కా ఇళ్ళు
 • ఐదేళ్లలో 25 లక్షల ఇళ్ళు కట్టిస్తాం
 • ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంటిని అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం
 • అంతే కాదు డబ్బు ఎప్పుడైనా అవసరమైతే అదే ఇంటి మీద పావలా వడ్డీకే రుణం వచ్చేట్టుగా బ్యాంకులతో మాట్లాడుతాం

బీసీ సంక్షేమం

 • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పనుల్లో 50% రిజర్వేషన్
 • బీసీల సంక్షేమం కోసం ఏటా రూ. 15,000 కోట్లు, 5 ఏళ్ళలో రూ. 75,000 కోట్లు